Modi: త్వరలో బుల్లెట్ రైలు

3
- Advertisement -

రైల్వేలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న అత్యాధునికంగా, శ‌ర‌వేగంగా జ‌రుగుతోంద‌ని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. త్వ‌ర‌లోనే బుల్లెట్ ట్రైన్ క‌ల సాకారం అవుతుందన్నారు. ఆధునిక హంగుల‌తో నిర్మిత‌మైన చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్‌ను వ‌ర్చువ‌ల్‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ… చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్‌తో సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణం సాధ్య‌మ‌వుతుందన్నారు. క‌నెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం… విక‌సిత్ భార‌త్ సంక‌ల్పంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల‌కు క‌నెక్టివిటీ పెంచేలా కృషి చేస్తున్నాం… ఒక్కో అడుగు వేసుకుంటూ దేశంలో కొత్త పుంత‌లు తొక్కిస్తున్నాం అన్నారు.

గత పదేండ్లలో 30 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు నిర్మించామన్నారు. వందే భార‌త్, అమృత్ భార‌త్, న‌మో భార‌త్ రైళ్ల‌ను ప్ర‌వేశ‌పెట్టాం అన్నారు. హైస్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ పెరుగుతోందని.. త్వ‌ర‌లోనే భార‌త్‌లో బుల్లెట్ ట్రైన్ క‌ల సాకారం అవుతుందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణ‌వ్‌, సోమ‌న్న‌, కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్, గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు. రూ. 428 కోట్ల‌తో ఈ ప్రాజెక్టు చేపట్టగా 19 ట్రాక్‌లు, ఐదు లిఫ్ట్‌లు, ఐదు ఎస్క‌లేట‌ర్లు ఏర్పాటు చేశారు.

Also Read:డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్..టికెట్ల రేట్లు పెంపు

- Advertisement -