ప్రధాని మోడీకి అరుదైన గౌరవం..

18
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. శ్రీలంక పర్యటనలో భాగంగా మిత్ర విభూషణ అవార్డు ప్రధానం చేసింది. ఇప్పటికే అనేక దేశాల నుంచి అరుదైన అవార్డులను అందుకున్న మోడీకి శ్రీలంక మిత్ర విభూషణ అవార్డును ప్రధానం చేసింది.

విదేశాల్లో మోడీకి లభించిన 22వ అంతర్జాతీయ పురస్కారం కావడం విశేషం. మిత్ర విభూషణ అవార్డులోని ప్రత్యేక చిహ్నాల అర్థం పరిశీలిస్తే.. ధర్మ చక్రం : రెండు దేశాల మధ్య బౌద్ధ సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తుంది.

పుణ కలశం: కొత్త ప్రారంభాలు, శుభత, ఐశ్వర్యానికి సంకేతం. నవరత్నాలు: భారత్-శ్రీలంకల మధ్య కొనసాగుతున్న దీర్ఘకాలిక స్నేహాన్ని సూచిస్తూ, పద్మదళాల చుట్టూ లోకగోళ రూపంలో ఉన్నాయి.సూర్యుడు, చంద్రుడు : ఈ రెండు దేశాల స్నేహం శాశ్వతంగా కొనసాగుతుందనే భావనను సూచించాయి.

Also Read:వైరల్‌ వీడియో..బైకర్‌ను లాక్కెళ్లిన బస్సు!

- Advertisement -