చిచ్చు పెట్టేందుకు మోడీ.. రెడీ?

37
- Advertisement -

బీజేపీ నేతలు వారి స్వార్థ రాజకీయాలకోసం ఎంతకైనా తెగిస్తారనేది ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు కాషాయ పార్టీ ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే ఈ విషయం ఎవరికైనా స్పష్టంగా అర్థమౌతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథుల నిర్ణయాలు తీసుకునే నిర్ణయాలు చేసే వ్యాఖ్యలు అన్నీ కూడా బీజేపీకి లాభం చేకూరే విధంగా ఉంటాయే తప్పా ప్రజలకు ఉపయోగకరంగా ఏ మాత్రం ఉండదవనడంలో ఎలాంటి సందేహంలేదు. ప్రస్తుతం ఎజెండా లేని పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది మోడీ సర్కార్. ఇక ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ లో నిన్న ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. .

తెలుగు రాష్ట్రాల విషయంలో నోరు మెదపడానికి ఏ మాత్రం ఆసక్తి చూపని మోడీ.. నిన్న మాత్రం ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలను ప్రస్వటించారు; అసలు తెలుగు రాష్ట్రాల ప్రస్తావన అవసరం లేకున్నప్పటికి ప్రత్యేకంగా నొక్కి చెబుతూ వివాదానికి తెరతీసే దొరణి అవలంభించారు మోడీ. ఆంధ్ర ప్రదేశ్ విభజన సరిగా జరగలేదని, తెలంగాణ లభించినప్పటికి ప్రజలు సంబరాలు చేసుకోలేదని, దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఎవరికి ఇష్ఠం లేదు అన్నట్లుగా మోడీ వ్యాఖ్యానించారు. దీంతో మోడీ ఉద్దేశ్యపూర్వకంగానే వివాదం సృష్టించేందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ప్రజల దశాబ్దాల కల.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో ప్రాణత్యాగలు చేసిన చరిత్ర మోడీ మరచి పోయారా ? రాష్ట్రం ఏర్పడిన రోజు తెలంగాణ ప్రజల సంబరాలు ఆకాశాన్నంటిన రోజులు మోడీకి గుర్తు లేవా ? అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అసలు మోడీ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడానికి అసలు కారణం ఏంటి అనే దానిపై రాజకీయ వాదాలు ఒక్కే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఆరు నెలల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగ్సానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ బీజేపీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి. పైగా అటు ఏపీ లోనూ ఇటు తెలంగాణలోనూ కేంద్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తార స్థాయిలో ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయం మోడీ సర్కార్ మాట తప్పిందనే ఆ రాష్ట్ర ప్రజలు గుర్రుగా ఉంటే తెలంగాణకు నిధులు సమకూర్చడంలో పక్షపాతం వ్యవహరిస్తోందని ఇటు తెలంగాణ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను దృష్టి మళ్లించేందుకు విభజన అంశాన్ని తెరపైకి తెచ్చి రెండు తెలుగు రాష్ట్రాల మద్య చిచ్చు పెట్టేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారనేది విశ్లేషకులు చెబుతున్నా మాట. అయితే మోడీ కుయుక్తులు ప్రజలకు తెలియనివి కాదు..ఎంత దృష్టి మరల్చే ప్రయత్నం చేసిన రెండు తెలుగు రాష్ట్రాలకు మోడీ చేసిన అన్యాయాలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరనేది వాస్తవం.

Also Read:తమిళంలో తెలుగు అమ్మడు ఉబలాట

- Advertisement -