BNP విజయం..మోదీ అభినందనలు

5
- Advertisement -

బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఆ పార్టీ చైర్మన్ తారీఖ్ రెహ్మాన్‌కు అభినందనలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఫిబ్రవరి 12న జరిగిన ఎన్నికల్లో బీఎన్‌పీ “నిర్ణాయక విజయం” సాధించిందని ఆయన పేర్కొన్నారు.

సోషల్ మీడియా వేదికగా రహ్మాన్‌ను ట్యాగ్ చేస్తూ మోదీ..మీ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజల విశ్వాసానికి ఈ విజయం నిదర్శనం. ప్రజాస్వామ్య, ప్రగతిశీల మరియు సమగ్ర బంగ్లాదేశ్‌కు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది అని పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసి, పరస్పర అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి పనిచేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

అధికారిక ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉన్నప్పటికీ, 300 సభ్యుల పార్లమెంట్‌లో బీఎన్‌పీ ఇప్పటికే రెండువంతుల మెజారిటీ సాధించినట్లు స్థానిక మీడియా నివేదించింది. సుమారు 212 స్థానాల్లో బీఎన్‌పీ విజయం సాధించినట్లు సమాచారం.

గత ఏడాది డిసెంబరులో 17 ఏళ్ల స్వీయనిర్బంధం అనంతరం దేశానికి తిరిగివచ్చిన రహ్మాన్, త్వరలో బంగ్లాదేశ్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 36 ఏళ్లకు పైగా తరువాత దేశానికి తొలి పురుష ప్రధానిగా నిలవనున్నారు.

Also Read:‘ది ప్యారడైజ్’..రిలీజ్ డేట్ ఫిక్స్‌

- Advertisement -