Modi:రష్యాకు అండగా ఉంటాం

26
- Advertisement -

రష్యాపై ఉగ్రదాడిని ఖండించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన మోడీ.. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని చెప్పారు.

రష్యా ఉగ్రదాడిలో 70 మంది మరణించగా 150 మందికి పైగా గాయపడ్డారు. ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్‌ ఫిక్‌నిక్‌ సంగీత కార్యక్రమంలో ఐదుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ కాల్పులకు పాల్పడింది తామేనని ఐసీస్ ప్రకటించింది. ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

- Advertisement -