ఓటు హక్కు వినియోగించుకోండి:మోడీ

341
modi
- Advertisement -

ఐఈడీ బాంబుల క‌న్నా.. ఓట‌రు ఐడీ అత్యంత శ‌క్తివంత‌మైన‌ద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. మూడవ దశ ఎన్నికల్లో భాగంగా అహ్మాదాబాద్‌లో ఓటేసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడిన మోడీ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఉగ్ర‌వాదుల‌కు ఐఈడీ బాంబులే ఆయుధాలు అని, కానీ ప్ర‌జాస్వామ్యానికి ఓట‌రు ఐడీయే శ‌క్తి అని అన్నారు. కుంభ‌మేళాలో న‌దీ స్నానం చేసిన త‌ర్వాత ఎంత ప‌విత్రంగా భావిస్తామో, అలాగే ప్రజాస్వామ్యంలో ఓటు వేసిన త‌ర్వాత అంతే ప‌విత్రంగా ఫీల‌వుతామ‌ని మోడీ అన్నారు.

స్వంత రాష్ట్రం గుజరాత్‌లో ఓటు వేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఐఈడీ(ఇంప్ర‌వైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్స్ డివైస్‌) క‌న్నా ఓట‌రు ఐడీ శ‌క్తివంత‌మైన‌ద‌ని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ని అన్నారు. మ‌న ఓట‌రు ఐడీల శ‌క్తి అంద‌రూ అర్థం చేసుకోవాల‌ని తెలిపారు.

అంతకముందు ఓటు వేసే ముందు గాంధీనగర్‌లో తన తల్లి నివాసముంటున్న ఇంటికి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా హీరాబిన్‌కి మోడీ పాదాభివందనం చేశారు. మోడీకి హీరాబెన్‌ స్వీటు తినిపించి.. ఆ తర్వాత తలపై చేతి పెట్టి ఆశీర్వదించారు.

మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు అస్సాం 12.36 శాతం, బీహార్ 12.60 శాతం, గోవా 2.29 శాతం, గుజరాత్ 1.35శాతం,ఉత్తరప్రదేశ్ 6.84 శాతం, పశ్చిపబెంగాల్ 10.97 శాతం, జమ్ము కశ్మీర్ 0.00 శాతం, కర్నాటక 1.75 శాతం, కేరళ 2.48 శాతం, మహారాష్ట్ర 0.99 శాతం, ఓడిశా 1.32శాతం, త్రిపుర 1.56 శాతం, ఛత్తీస్‌గఢ్ 2.24 శాతం, దాద్రా నగర్ హవేలి 0.00 శాతం, డయ్యు డామన్ 5.83శాతం పోలింగ్ నమోదైంది.

- Advertisement -