- Advertisement -
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఇవాళ వర్చువల్‌గా సమావేశం కానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రెండు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల భేటీకి సమాంతరంగా ఈ సమావేశం జరుగుతుందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఇండో–పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటులో పురోగతి, మౌలిక వసతులపై బైడెన్, మోదీ చర్చించనున్నారు.
వాషింగ్టన్ లో రెండు దేశాల కేంద్రమంత్రులు భేటీ కానుండగా మోడీ, బైడెన్.. వర్చువల్ గా హాజరవుతారు. ఈ భేటీ కోసం రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్నారు.
- Advertisement -