మోడీ మళ్లీ రావాలి..

222
modi fan

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే తొలిదశ ఎన్నికల సమరం ముగియగా ప్రధాన పార్టీలన్ని గెలుపు కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులకు తోడుగా వారిని ఫాలో అయ్యేవారు కూడా తమ నేతను ఎందుకు గెలిపించాలి అన్నదానిపై వివరణ ఇస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

మళ్లీ మోడీనే రావాలంటూ ఓ యువకుడు ఇచ్చిన సందేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూటిగా సుత్తి లేకుండా మోడీ ఎందుకురావాలో చెప్పి తన అభిమానాన్ని చాటుకున్నాడు. మోడీని విమర్శించే వారు నాణేనికి ఒక వైపు మాత్రమే చూస్తున్నారని గత నాలుగేళ్లుగా భారత్‌లో జరిగిన మార్పులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

పదే పదే వివిధ దేశాలకు ప్రధానమంత్రి వెళ్తు ప్రజలను పట్టించుకోవడం లేదని ఫన్నీగా ఆరోపిస్తున్నారని పేర్కొన్న ఆ యువకుడు 70 సంవత్సరాల చెత్తను 4 సంవత్సరాల్లో కడిగేసే ప్రయత్నం చేశారని చెప్పారు.

ఇక ప్రపంచదేశాలు భారత్‌ వైపు చూసేలా చేసిన ఘనత మోడీదని…గత పాలకులతో పోలిస్తే భారత్ ఇప్పుడు మెరుగైన ఫలితాలను రాబడుతుందన్నారు. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం ఆలోచించి మోడీకి మళ్లీ అధికారం కట్టబెట్టి భారత్‌ను నిలబెట్టాలని పిలుపునిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోడీ ఫ్యాన్స్,బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు.