ఒకే వేదికపై భారత్ – పాక్ ప్రధానులు

86
modi
- Advertisement -

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌ వెళ్లారు. ఆయనకు ఉజ్బెకిస్థాన్‌ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయేవ్ స్వాగతం పలికారు.

షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సు వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్థాన్‌ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయేవ్ తో పాటు పాటు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇతర నేతలు ఫొటో దిగారు.

మోదీ-జిన్ పింగ్, మోదీ-పుతిన్ ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్‌సీవో సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రాంతీయ సమస్యలతో పాటు అంతర్జాతీయ అంశాలు చర్చించనున్నారు. షాంఘై సహకార సంస్థ 2001లో ప్రారంభమైన విషయం తెలిసిందే.

- Advertisement -