సాధువుగా మారిన మోడీ..

10
- Advertisement -

సాధువు అవతారమెత్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆధ్యాత్మిక యాత్ర కోసం కన్యాకుమారి వెళ్లిన మోడీ… పరమసాధువుగా మారిపోయారు. కాషాయ దుస్తులు ధరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శామియానాపై ప్రశాంత వాతావరణంలో ధ్యానంలో కూర్చున్నారు. క‌న్యాకుమారిలో 45 గంట‌ల పాటు ధ్యానం చేయ‌నున్నారు.

ఐదేళ్ల కిందట 2019లో ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే కేదార్‌నాథ్‌ సందర్శించారు. 2014లో ఆయన మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు సంబంధించిన ప్రతాప్‌గఢ్‌కు వెళ్లారు. ఈసారి కన్యాకుమారిని ఎంచుకున్నారు.

543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ఎన్నికలు ప్రారంభం కాగా జూన్‌ ఒకటిన చివరి దశ పోలింగ్‌ జరుగనుంది. జూన్‌ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Also Read:బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్

- Advertisement -