‘ప్రధాని నాకన్నా పెద్ద నటుడు అంటున్నాడు ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్. అంతేకాదు నాకొచ్చిన జాతీయ అవార్డులను ఆయన అందుకోవడానికి అర్హుడ’ని బహుభాషా నటుడు ప్రకాష్‌రాజ్ అన్నారు. గౌరీ హత్య జరిగి నెల కావస్తున్నా ఆ సంఘటనపై ప్రధాని నరేంద్రమోదీ నేటికీ పెదవి విప్పకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గౌరితో ప్రకాష్‌రాజ్‌కు మంచి స్నేహ బంధముంది. ‘పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య ఘటనపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా బాధ కలిగిస్తోంది. ఆమె హత్యపై అంతర్జాతీయంగా ప్రచారం జరిగినా ఏమి ఎరగనట్లుగా కేంద్రం వ్యవహరించడం శోచనీయమని’ అన్నారు.
బెంగళూరులో జరిగిన ఒక ర్యాలీలో పాల్గొన్న ఆయన..గౌరీ లంకేశ్ హత్య విషయంలో ప్రధాని మోడీ తీరును తీవ్రంగా తప్పు పడుతూ.. ఈ ఘటనపై ఆయన నిశ్శబ్దం సరికాదన్నారు. తనకు 5 జాతీయ పురస్కారాలు లభించినట్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. మోడీతో పాటు యూపీ సీఎం పైనా ప్రకాశ్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనకు యోగిని చూస్తే యూపీ ముఖ్యమంత్రా? లేక.. గుడిలో పూజారా? అన్నది అర్థం కానట్లుగా ఉంటుందన్నారు.
తన నటనను మెచ్చి ఇచ్చిన జాతీయ అవార్డుల్ని ప్రస్తావిస్తూ.. నటనలో మోడీ తనను మించి పోయారన్న వ్యాఖ్యతో పాటు.. ఆయనకు నేను అవార్డు ఇవ్వాల్సిందేనని వ్యాఖ్యానించారు. ప్రకాశ్ రాజ్ మాటల్ని అర్థం చేసుకునే విషయంలో మీడియాలో దొర్లిన తప్పుతో తనకొచ్చిన జాతీయ అవార్డుల్ని వెనక్కి ఇస్తానని వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చేశాయి. దీంతో.. తన మాటను మరింత స్పష్టంగా చెప్పేందుకు ట్విట్టర్లో ఒక వీడియో ట్వీట్ చేసి క్లారిటీ చేశారు. తనకు ఇచ్చిన అవార్డుల్ని వెనక్కి ఇస్తానని తాను చెప్పలేదని..అయినా ఆ మాట అనటానికి తానేమైనా పిచ్చోడ్నాఅని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రముఖ నటుడు ప్రధాని మోడీని ఉద్దేశించి ఈ స్థాయిలో విరుచుకుపడుతూ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది.
What's said…n what's not said. For all out there .. thank you pic.twitter.com/zIT7rnkFxb
— Prakash Raj (@prakashraaj) October 2, 2017