నసీర్‌కు షాకిచ్చిన ఎమ్మెన్నెస్…

256
naseeruddin
- Advertisement -

బాలీవుడు నటుడు నసీరుద్దీన్‌ షాకు షాకిచ్చింది మహరాష్ట్ర నవనిర్మాణ్ సేన. ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ నవనిర్మాణ్ సేన..ఆయన భారత్ విడిచి వెళ్లాలని కోరుతూ పాకిస్థాన్‌కు టికెట్‌ బుక్ చేసింది. అదికూడా పాక్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 14న.

నసీర్‌కు భారత్‌లో ఉండటం కష్టమైతే పాక్‌లోనే ఉండాలని సూచించింది. ఎమ్మెన్నెస్ షాకు టికెట్ బుక్ చేయడం ఆసక్తికరంగా మారింది.

గోవధ ఆరోపణలతో బులంద్‌షహర్‌లో జరిగిన హింసాకాండ, ఒక పోలీసు అధికారితో సహా ఇద్దరి హత్యకు గురికావడంపై నసీర్ స్పందించారు. భారతదేశంలో ఒక పోలీసు కన్నా గోవు మరణానికే అధిక ప్రాధాన్యమున్నదని షా వ్యాఖ్యానించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వారికి అండదండలు లభిస్తున్నాయని ఆయన అన్నారు. దీనిపై ఘాటుగా స్పందించింది ఎమ్మెన్నెస్.

- Advertisement -