నారీ దీక్షలు చంద్రబాబు డ్రామాలో భాగం..

274
- Advertisement -

విజయవాడ భవానీ పురం ఘటన నన్ను ఎంతగానో కలిచి వేసింది. టిడిపి నారీ దీక్షలు చూస్తే సిగ్గు వేస్తోందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. టిడిపి చేపట్టిన దీక్షపై ఆమె తీవ్రంగా ద్వజమెత్తారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి హయాంలో మహిళలపై అకృత్యాలు అందరికీ తెలుసు.. నారీ దీక్షలు చంద్రబాబు డ్రామాలో భాగం అన్నారు. లోకేష్ వారి పార్టీ ఆఫీసులో మహిళ పట్ల అనుచితంగా వ్యవహరించిన తీరును దృష్టి మరల్చడానికే ఈ నారీ సంకల్ప దీక్షలు చేస్తున్నారు.

టిడిపి వంగలపుడి అనిత గారు మీరు జెర్రీ పోతుల పాలెం ఘటనకు సమాధానం చెప్పరా.. దళిత యువతికి వివస్త్ర చేసి మీ టిడిపి నాయకులు దాడి చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు అని ప్రశ్నించారు. దిశ చట్టం తీసుకువచ్చినప్పుడు మీ టిడిపి ఎమ్మెల్యేల కాగితాలు చింపేసారు. మహిళా సీఎంల పాలనా రాష్ట్రాల్లో కూడా జగన్ మోహన్ రెడ్డిలా ఆలోచనలు చేయలేదు. చంద్రబాబు నాయుడు మీ 14 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి లా ఆలోచనలు చేయలేదు. ఏపీలో ఫాక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తే మీకు ఇప్పుడు విమర్శలు చేయడానికి నోరు ఎలా వస్తుంది..మహిళ పక్షపాతి ఎవరూ అన్నది తెలుగు మహిళలు ఆలోచించాలి అని కళ్యాణి కోరారు.

- Advertisement -