పార్టీ మార్పు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను: ఎమ్మెల్సీ

491
MLC Tera Chinnapa Reddy
- Advertisement -

తాను పార్టీ మారుతానని ప్రసార సాధనాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి ఖండించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహాయ్య అకాల మ‌ర‌ణంతో నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉపఎన్నిక వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సాగ‌ర్ ఉపఎన్నిక స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మౌతుంది. ఈ క్ర‌మంలో భాగంగా నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ నేత‌, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్న‌ప‌రెడ్డి పార్టీ మార‌బోతున్నార‌ని అస‌త్య ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి.

దీనిపై ఆయ‌న స్పందిస్తూ పార్టీ మారుతార‌నే ప్ర‌చారాన్ని తీవ్రంగా ఖండించారు. త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారం నిజం కాద‌న్నారు. త‌మ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్‌కు విధేయుడిన‌న్నారు. ఎమ్మెల్సీగా త‌న ప‌ద‌వీకాలం ఇంకో ఏడాది ఉన్న‌ట్లు పేర్కొన్నారు. నేను ఎక్కడికి వెళ్ల లేదు..ఎవరితోను చర్చలు జరపలేదు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని నా నివాసంలో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -