సీఎం కేసీఆర్‌ని కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రభాకర్ రావు

199
kcr prabhakar
- Advertisement -

హైదరాబాద్‌ (స్థానిక సంస్థల) ఎమ్మెల్సీ ఎమ్మెస్‌ ప్రభాకర్‌ రావు..సీఎం కేసీఆర్‌ని కలిశారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ని కలిసిన ప్రభాకర్‌రావు తనకు హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిఆర్ఎస్ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

టీఆర్ఎస్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. వారిలో ఆకుల లలిత, సంతోష్ కుమార్, ఎమ్‌ఎస్‌ ప్రభాకర్ రావు, దామోదర్ రెడ్డిలు ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభాకర్‌రావుకు అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్.

- Advertisement -