MLC Patnam: అక్రమమైతే కూల్చండి..హైడ్రా మంచే చేస్తుంది

7
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన హైడ్రా ఆలోచన గొప్పది అన్నారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన పట్నం. రూల్స్ కి వ్యతిరేకంగా ఉంటే నా బిల్డింగులు నేనే కూలగొడుతాను అన్నారు. సీఎం నిర్ణయానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.

చెరువులు అక్రమించినవాళ్లపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడం మంచి నిర్ణయం అన్నారు. కబ్జాలు చేయాల్సిన అవసరం తనకు లేదని..నా ఆరోపణలు చేస్తున్న భూమి పట్టా ల్యాండ్ ఉందన్నారు. ఆ భూమి ధరణిలో నా కుమారుడు పేరు పై ఉందని..నా బిల్డింగ్ రూల్స్ ప్రకారం కట్టాం అన్నారు. ఆనాడు ఇరిగేషన్ ఈఈ, కలెక్టర్ తి మాట్లాడి సర్వే చేయించిన తర్వాతే బిల్డింగ్ కట్టాను అన్నారు.

బిల్డింగ్ పక్కనే నా మామిడి తోట, కూరగాయల తోట కూడా ఉందని..నాకు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు అన్నారు. నేను కట్టింది అక్రమం అని తేల్చి నాకు నోటీసులు ఇస్తే, ఆరోజే వెళ్లి కూల్చేస్తాను అన్నారు. గండిపేట చెరువు పైభాగాన కొత్వాల్ గూడ లో 14.14 గుంటల భూమిని 1999లో భూమిని కొనుగోలు చేశాను అన్నారు.

ఇది నా కొడుకు రినీష్ పేరు మీద ఉందని..పట్టా ల్యాండ్ తీసుకొని మామిడి తోట, వరి సాగు చేస్తున్నాను అన్నారు. హంగులు, ఆర్భాటాలు లేకుండా చిన్న ఇల్లు కట్టుకున్నా అన్నారు మహేందర్ రెడ్డి.

Also Read:Harish Rao: మూతపడుతున్న పాఠశాలల.. హరీశ్‌ ఫైర్

- Advertisement -