ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన పల్లా..

298
MLC Palla
- Advertisement -

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని, మరి కొద్ది రోజుల్లో తెలంగాణ భారత దేశ ధాన్యగారంగా మారుతుందని అన్నారు రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి…యాదాద్రి భువనగిరి జిల్లా లో ధాన్యం కొనుగోళ్ళకు ఆయన పరిశీలించారు….కొనుగోలు కేంద్రాల్లో ఉన్న రైతులతో మాట్లాడి అక్కడి పరిస్థితి లను అడిగి తెలుసుకున్నారు.

ఆలేరు నియోజకవర్గంలో ని వంగపల్లి,,చిన్న కందుకూరు, శారాజీ పేట గ్రామలో విప్ గొంగిడి సునీత, DCCB చైర్మన్ మహేందర్ రెడ్డి లతో కలిసి ధాన్యం కొనుగోళ్ళకు పరిశీలించారు…ఈ సీజన్ లో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని, దేశంలోనే ఇది రికార్డ్ అని పల్లా అన్నారు… ముఖ్యమంత్రి కేసీఆర్ అనుక్షణం మానిటరింగ్ చేస్తూ 30 వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనేలా చర్యలు తీసుకున్నారని అన్నారు.. 24 గంటల ఉచిత కరంట్, పెట్టుబడి సాయం, పెండింగ్ ప్రాజెక్ట్ లను, కాళేశ్వరం ప్రాజెక్టు లను పూర్తి చేసి సాగు నీరు అందించడం వల్లనే రైతులు బంగారు పంటలు పండించారని పల్లా రాజేశ్వర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు..

ఎప్పటికప్పుడు గొనె సంచుల కొరతను అధిగమిస్తూ, రవాణా, మిల్లర్లు, ట్రడర్లు, FCI వారితో అనుసంధానం చేస్తూ ధాన్యాన్ని తరలిస్తున్నట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు…. ఇప్పటి వరకు 800 కోట్లు రైతులకు చెల్లించామని, వరి తో పాటు మొక్కజొన్న, కందులు,పెసర్లు, రాగులు, అన్ని రకాల పంటలను కొనుగోలు చేస్తున్నామని అన్నారు…

రైతు ప్రభుత్వం గా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుంటే కళ్ళు లేని కాబోదిల్లా ప్రతిపక్ష పార్టీలు చిల్లర మల్లర ఆరోపణలు చేయడం వారి విజ్ఞత కే వదిలేస్తున్నామని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు….TRS ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోళ్ళను పర్యవేక్షణ చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం పార్టీ కార్యాలయాల్లో, AC గదుల్లో కూర్చొని ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు…

- Advertisement -