బిజెపి నేతలు కళ్లుండి కబొదులుగా వ్యవహరిస్తున్నారు..

41
MLC Palla Rajeshwar Reddy

బిజెపి నేతలు అనాలోచితంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం వారు తెలంగాణ భవన్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సంద్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బిజెపి నేతలు అనాలోచితంగా మాట్లాడుతున్నారు. జోకర్, బఫూన్ల లాగా మాట్లాడుతున్నారు. దేశంలో ఎక్కడైనా రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నారా..బిజెపి నేతలు చెబుతారా అని ప్రశ్నించారు. కోటి 45 లక్షల ఎకరాల్లో ఈ యాసంగిలో సాగు అయ్యింది. ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ స్థాయిలో ధాన్యం సేకరణ చేయటం లేదు.. కరోనా వున్నా రాష్ట్రంలో ధాన్యం కొంటున్నం.

నలుగురు ఎంపీలకు దమ్ముంటే ఒక్క మెడికల్ కాలేజీ అయినా తేవాలి. ఒక్క ప్రాజెక్ట్ అయినా జాతీయ హోదా తేవాలి.మేము కొత్తగా చాలా జిల్లాలో మెడికల్ కాలేజీ పెడుతున్నాం. కరోనా విషయంలో ఏ రాష్ట్ర సీఎం చేయనట్లు ఇక్కడ కెసిఆర్ ఆస్పత్రులకు వెళ్లి అందరికీ ధైర్యం చెప్పారు. అనేక సమీక్షలు చేసి.. ఆక్సిజన్‌తో సహా అన్ని అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు..బిజెపి నేతలు కళ్లుండి కబొదులుగా వ్యవహరిస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.

మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ధ్యానం కొనుగోలుకు 7 వేల కొనుగోలు సెంటర్లు పెట్టమని సీఎం చెప్పారు. పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం.ఇప్పటికీ 72 శాతం ధాన్యం కొనుగోలు చేశాము. ఇప్పటికే 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఇతర రాష్ట్రాలు రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేయటం లేదు.. కరోనా టైంలో ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. బిజెపి నేతలు అనాలోచితంగా మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు.