సీఎం కేసీఆర్‌ని కలిసిన ఎమ్మెల్సీ పల్లా…

60
cm kcr

తన పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌ని కలిశారు ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ప్రగతి భవన్‌లో సీఎంని మర్యాదపూర్వకంగా కలిసిన పల్లాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్.

రైతు బంధు ద్వారా తనకు వచ్చిన పెట్టుబడి సాయం రూ. 2,13,437ని రైతు బంధు సమితి పేరు మీద చెక్కు రూపంలో సీఎంకు అందజేశారు. ఇక తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించిన పల్లా తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు.

ఇక పల్లా పుట్టినరోజు సందర్భంగా శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, రైతు బంధు సమితి సభ్యులు, అభిమానలు పల్లా రాజేశ్వర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.