- Advertisement -
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తండాలలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తలకొండపల్లి,కడ్తాల్ మండలాలలోని వెంకటాపూర్ తండా.పెద్దవేములోనిబావి తండా,గుర్లకుoట తాండాలలోని నిరుపేదలకు బియ్యం, కూరగాయలు, గుడ్లు,నిత్యావసర సరుకులు,మాస్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలను ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని ఎమ్మెల్సీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- Advertisement -