SSC పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించలేరా!

2
- Advertisement -

పదవ తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేని చేతగాని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుంది అని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. పరీక్ష పూర్తి కాకముందే ప్రశ్నా పత్రం వాట్సాప్ లో ప్రత్యక్షమవడం, సంస్కృతం ప్రశ్నా పత్రానికి బదులు తెలుగు ప్రశ్నా పత్రం ఇవ్వడం సర్కార్ పేలవమైన పనితీరుకు నిదర్శనం అన్నారు.

విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద అట్టిపెట్టుకోవడం వల్లే రాష్ట్రంలో విద్యారంగం విస్మరణకు గురవుతుందన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతున్న వారి పై బూతులు తిట్టడం మానేసి పాలన పై దృష్టి పెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అని మండిపడ్డారు.

 

Also Read:తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్

- Advertisement -