సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు లేదు..

116
kavithaa
- Advertisement -

సీబీఐ నోటీసులపై మరోసారి స్పందించారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సంబంధించి సీబీఐ నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని తేల్చిచెప్పారు.

సీబీఐ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్‌ను క్షుణ్నంగా పరిశీలించాను. అందులో పేర్కొని ఉన్న నిందితుల జాబితాను చూశాను. దాంట్లో తన పేరు ఎక్కడా లేదని కవిత తెలిపారు. ముందే ఖరారైన కార్యక్రమాలతో ఈ నెల 6వ తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు.

ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని పేర్కొన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని కవిత చెప్పారు. దర్యాప్తునకు సహకరించడానికి పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశం అవుతానని లేఖలో చెప్పారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -