బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్

6
- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవితను పార్టీ సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, టీ రవిందర్ రావు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటనలో వెలువరించారు.

ఇటీవలి కాలంలో కవిత వ్యవహరిస్తున్న తీరు పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉందని, ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుందని, అందుకే పార్టీ అధినేత కేసీఆర్… కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని వారు తెలిపారు.

హరీష్ రావు, సంతోష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం కవిత కాంట్రావర్సీ కామెంట్స్ చేయగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -