శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత తొలి ప్రసంగం..

166
mlc kavitha
- Advertisement -

ఈరోజు శాసన మండలిలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సి కవిత తొలి సారి ప్రసంగించారు. కేంద్రం 15 ఫైనాన్స్ కమిషన్ లో 500 కోట్లు లోటు పెట్టినా… స్ధానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అదనంగా 500 కోట్లు కేటాయించారని కవిత తెలిపారు. ఇంకా కొన్ని లోటు పాట్లు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అన్నారు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంపిపి లకు కార్యాలయాలు లేవు.. అలాగే ఎంపీటీసీ లకు కూడా గ్రామపంచాయతీలో కూర్చోడానికి కుర్చీ లేదు.. వారికి తగిన ప్రాముఖ్యత ఇవ్వాలి అన్నారు. చట్టాన్ని సవరణ చేసి అయినా సరే పాఠశాలలో జెండా ఎగురవేసి అధికారం ఎంపిటిసి ,జెడ్పీటీసీ లకు కల్పించాలి అని ఎమ్మెల్సీ కవిత కోరారు.

- Advertisement -