- Advertisement -
ఆనాడు ఉద్యమ సమయంలో ఆంధ్రా సినిమాలను అడ్డుకున్న ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి అన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ జాగృతి అధ్వర్యంలో లీడర్ నాయకత్వ శిక్షణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత… సినిమాలతో వచ్చిన డబ్బును మన తెలంగాణలో ఖర్చు చేస్తూ మనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆంధ్రా సినిమాలను తెలంగాణ జాగృతి వ్యతిరేకించింది అన్నారు.
తెలంగాణ జాగృతి సంస్థ యువత, మహిళలను నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్‌లో లీడర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. నాయకత్వ లక్షణాలను, సామాజిక సమస్యలపై అవగాహన, నిర్ణయాధికార నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ సమాజంలో మార్పు తీసుకురావాలంటే, యువత, మహిళలు నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలని కవిత పేర్కొన్నారు.
Also Read:ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు..
- Advertisement -

