కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్!

9
- Advertisement -

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదు ? అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో పాల్గొన్నారు కవిత. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహాధర్నా కార్యక్రమం జరగనుంది.

తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదు?.. గోదావరి ‌ – పెన్నా అనుసంధానం పేరిట నీళ్లు తరలింపును తక్షణమే అడ్డుకోవాలి అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తున్నాను అన్నారు.

ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతోంది?… ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోం అన్నారు. హైదరాబాద్ లో ధర్నా చేయనివ్వకపోతే జిల్లాల్లో, గల్లీల్లో ధర్నా చేస్తాం… కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు అన్నారు.కేసీఆర్ కి నోటీసులు ఇచ్చారంటే.. మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే… తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా ? చెప్పాలన్నారు. తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబెట్టడం తప్పా ?… కాళేశ్వరం కమిషన్ కాదు.. అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అని ఆరోపించారు కవిత.

Also Read:TTD:దివ్యదర్శనం టోకెన్ల కౌంటర్లు మార్పు

- Advertisement -