మోదీ బీసీ అయితేంది.. కాకపోతేంది?

11
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌లకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. బీసీ అంశాన్ని దృష్టి మరల్చడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి అన్నారు. కుల సర్వేలో బీసీల తప్పుడు లెక్కల చర్చను పక్కదోవపట్టించడానికి మోదీ బీసీనా కాదా అన్న చర్చకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారు అన్నారు.

దాంతో రాహుల్ గాంధీది ఏ మతమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు.. వీళ్లు వాళ్లను, వాళ్లు వీళ్లను తిడుతూ వాళ్లిద్దరు ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు అన్నారు. మోదీ బీసీ అయితేంది కాకపోతేంది ?.. రాహుల్ గాంధీ ఏ మతమైతే మాకేందీ ?… బీసీల జనాభాను సరిగ్గా లెక్కబెట్టాలన్నదే మా డిమాండ్ అన్నారు.

కాంగ్రెస్ అసెంబ్లీలో బిల్లు పెట్టాలి… బీజేపీ కేంద్రంలో దాన్ని ఆమోదించాలన్నారు. ఇవి చేయకుండా మోదీ, రాహుల్ కులమతాల గురించి ప్రజలకు ఎందుకు ? ,బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రజలను అవమానిస్తున్నాయి అన్నారు. తెలంగాణ చాలా రాజకీయ కుట్రలు చూసింది… ఆ రెండు పార్టీల కుట్రలు ఇక్కడ నడవవు అన్నారు.

బీసీ బిడ్డలను మోసం చేయవద్దని కాంగ్రెస్, బీజేపీ పార్టీలను హెచ్చరిస్తున్నాను.. సీఎం రేవంత్ రెడ్డి వంకర టింకర మాటలు మాట్లాడి ప్రజలను ఆగం చేస్తున్నారు అన్నారు. ఏ ఒక్క అంశానికి, సమస్యకు ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి పరిష్కారం చూపలేదు.. తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అన్నారు…తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ను తలవని గుండెలేదు అన్నారు.

Also Read:తెలంగాణ భవన్‌లో కేసీఆర్ బర్త్ డే వేడుకలు

ప్రతీ ఒక్కరు కేసీఆర్ జన్మదినం సందర్భంగా పూజలు చేస్తున్నారు.. ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు కాబట్టే కేసీఆర్ ను ప్రజలు ఆరాధిస్తున్నారు అన్నారు. అందరి ఆశీర్వాదంతో మరింత శక్తియుక్తులతో కేసీఆర్ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారు.. 14 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నరకం చూపిస్తోందన్నారు.
.

- Advertisement -