రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అభ్యర్థులే లేరన్నారు ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. కాంగ్రెస్,బీజేపీ పార్టీల తీరుపై మండిపడ్డారు. రైతుల కోసం బీజేపీ పార్టీ మీటింగ్ పెట్టడం హంతకుడే రైతులకు సంతాపం తెలిపినట్టుందని ఎద్దేవా చేశారు.
రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ చూస్తోందని..రైతు బంధును కాపీ కొట్టి ఇప్పుడు కొంతమందికే రైతు బంధు అందిస్తోందన్నారు. కానీ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ రైతు బంధు వర్తింప చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పెట్టి దళితులకు ఏమో చేస్తామనడం భావ దారిద్ర్యం తప్పా మరొకటి కాదన్నారు.
ఎస్సీలను ఎన్నో ఏండ్లు పేదరికంలో ఉంచిన చరిత్ర కాంగ్రెస్‌ది అని … ఆ పార్టీ రాజకీయ లబ్ధికోసం చేసే ఎత్తుగడలు తప్పా దళితుల కోసం చేసేదేమీ లేదన్నారు. ఇన్ని రోజులు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసిందని ప్రశ్నించారు.
Also Read:హీరో కూతురు పెళ్ళికి ముందే శోభనం