రైతు బంధు ఎన్నికల కోసం తీసుకొచ్చిన పథకం కాదన్నారు ఎమ్మెల్సీ కవిత. రైతు బంధు నిధులను నిలిపివేయడంలో కాంగ్రెస్ నేతల హస్తం ఉందన్నారు. మీడియాతో మాట్లాడిన కవిత..రైతుల నోటికాడికి వచ్చిన బుక్కను అడ్డుకున్నారన్నారు. విభజన హామీలపై కాంగ్రెస్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు.
తెలంగాణ వచ్చాక అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. ఎన్ని బుల్డోజర్లు వచ్చినా అడ్డుకుని తీరుతామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసుకున్నామన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలపై కాంగ్రెస్‌కు ప్రేమ లేదన్నారు. సింగరేణిని ప్రైవట్ పరం చేసిందే కాంగ్రెస్ అన్నారు. బీజేపీని కాంగ్రెస్ నేతలు ఎందుకు ప్రశ్నించరన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే రైతు బంధును ఎత్తగొట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమి లేదన్నారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఛాన్స్ ఇస్తే ఆగమాగం అవడం ఖాయమన్నారు.
Also Read:ఆన్సర్ చెప్పే దమ్ముందా.. రాహుల్ గాంధీ?