Kavitha:బాండ్ పేపర్లతో చెత్త రాజకీయాలు

46
- Advertisement -

137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దిగజారిపోయిందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. బాండ్ పేపర్ల పేరిట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారని..జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, దామోదర రాజనరసింహా, భట్టి విక్రమార్క వంటి పెద్ద నాయకులు కూడా బాండ్ పేపర్ రాసివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత విశ్వాసం కోల్పోయిందో చెప్పడానికి ఒక ఉదాహరణ అన్నారు.

కర్నాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే డ్రామా చేసిందని, 223 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాశారని గుర్తు చేశారు. కానీ అందులో వేటిని కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయారని మండిపడ్డారు కవిత. కర్నాటకలో మహిళలకు రూ. 2 వేల పెన్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వంటి హామీలను ఇంకా మొదలుపెట్టలేదని…యువనిధి కింద ఇస్తామన్న మొత్తాన్ని కూడా పంపిణీ చేయడం లేదన్నారు.

బియ్యం పథకానికి బియ్యం లేదని చెప్పి అది కూడా పంపిణీ చేయడం లేదని…మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి బస్సుల సంఖ్యను భారీగా తగ్గించారన్నారు. కర్నాటక సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో పాటు సీనియర్ నాయకులు మొత్తం ఇదే రకమైన డ్రామా చేశారని దుయ్యబట్టారు కవిత.సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం నిరుద్యోగంలో బీజేపీ పాలనలో ఉన్న హర్యాన నెంబర్ వన్ గా ఉందని, కాంగ్రెస్ పాలిస్తున్న రాజస్థాన్ రెండో స్థానంలో ఉందన్నారు.

Also Read:ప్రతీ ఒక్కరికీ నచ్చే..‘కాలింగ్ సహస్ర’

- Advertisement -