Kavitha:మోడీ పెద్దన్న ఎలా అవుతాడు?

26
- Advertisement -

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లో మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. కొత్తగా GO నంబర్ 3 ను తీసుకొచ్చిందని..దీనిని ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. ఈనెల 8న మహిళ దినోత్సవం నాడు ధర్నా చౌక్ లో నల్ల రిబ్బన్ లతో ధర్నా లో పాల్గొంటాం అన్నారు. నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం…మహిళలకు, అభ్యర్థులకు తీరని అన్యాయం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు.

6వేల ఉద్యోగాల్లో మహిళలకు ఇచ్చింది కేవలం 70 వరకు మాత్రమేనని…33 శాతం రావాల్సిన రిజర్వేషన్ పూర్తిగా వెనక్కి పోయిందన్నారు. రోస్టర్ విధానం తో ఎక్కువ మందికి మహిళలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందని…ఈనెల 8న ధర్నా చౌక్ లో నల్ల బ్యాడ్జ్ లతో నిరసన ప్రదర్శనలు తెలుపుతాం.కలిసి వచ్చే అందరిని కలుపుకొని ముందుకు పోతాం అన్నారు.

మోడీ పెద్దన్న అని రేవంత్ రెడ్డి సంభోదించారు….బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని అర్దం అవుతుందన్నారు. ఒక్క రూపాయి కూడా కేంద్ర బడ్జెట్ లో ఇవ్వని మోడీ ఎలా పెద్దన్న అవుతాడో రేవంత్ రెడ్డి చెప్పాలని…రాహుల్ గాంధీ తెలంగాణ లో పోటీ చేస్తే స్వాగతిస్తాం అన్నారు.కానీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను గుర్తించి ఓటు వేయాలన్నారు.

తెలంగాణ తల్లి విగ్రహం పెట్టె ప్లేస్ లో ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు. అంటే కాంగ్రెస్ హై కమాండ్ మెప్పు పొందేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడతారన్నారు. బలి దేవత అన్న సోనియా గాంధీ ని ఇవాళ తెలంగాణ తల్లి అంటున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు….ఇవాళ ఎమ్మెల్యే ల లంచం కేస్ లో 5 జడ్జీల తీర్పును మేము స్వాగతిస్తున్నాం…ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్వాగతించారు… ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటి కేస్ లో మొదటి ముద్దాయి అన్నారు.కేంద్రం చొరవ చూపి ఇలాంటి కేస్ లను ముందుగా తీసుకోవాలన్నారు.

Also Read:USA:ట్రంప్‌పై నిక్కీ హేలీ గెలుపు

- Advertisement -