కాంగ్రెస్ నేతలు నాపైన,భారత జాగృతి సంస్ధపైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. నిన్న ఇంద్రవెల్లిలో జరిగిన కాంగ్రెస్ సభకు ప్రభుత్వం నిధులు ఉపయోగించారని…ఉదయం పార్టీ పరమైన కార్యక్రమాలు ఇంద్రవెల్లిలో చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వానికి ఫీజు చెల్లించారో లేదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ మలి దశ అమరవీరుల కుటుంబాలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. గ్యాస్ సిలిండర్ ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రియాంక గాంధీని పిలుస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు…ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తారో చెప్పాలన్నారు. ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ సర్పంచ్ గా గెలవలేదు…ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ వస్తే నల్ల బుగ్గలు ఎగురవేసి నిరసనలు తెలుపుతామన్నారు.వారానికి రెండు రోజులు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు…ప్రభుత్వ ప్రకటనలు ఉండవని చెప్పిన రేవంత్ రెడ్డి సీఎం కాగానే భారీ ప్రకటనలు ఇస్తూ ప్రభుత్వ ధనం ఖర్చు చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడ మైనారిటీలో పడ్డా వారిని హైదరాబాద్ తీసుకువచ్చి వారికి సపర్యలు చేస్తున్నారని..రేవంత్ రెడ్డి సిఎం అయ్యాక ఒక్క రోజు మాత్రమే ప్రజలను కలిశారన్నారు. రేవంత్ రెడ్డి యూ టర్న్ ముఖ్యమంత్రి అని పిలుస్తున్నారని…ప్రజల వద్దకు పాలన పోవాలని కేసీఆర్ చిన్న జిల్లాలు చేశారన్నారు.రేవంత్ రెడ్డి సోదరులు ఏ హోదా లేకపోయినా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో చెప్పాలన్నారు.
కేసీఆర్ కుటుంబం అంటూ రేవంత్ రెడ్డి పదేపదే వ్యాఖ్యలు చేశారు..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున 22 కుటుంబాలకు చెందిన వారు ఎన్నికల్లో పోటీ చేశారు..కాన్వాయ్ అవసరం లేదని చెప్పిన రేవంత్ రెడ్డి పెద్ద కాన్వాయ్ లో తిరుగుతున్నారన్నారు. సోనియా గాంధీ కాళ్ళు మొక్కడం తప్ప జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి అనలేదని…తెలంగాణ అమరవీరులకు రేవంత్ రెడ్డి నివాళులు అర్పించలేదన్నారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని…పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు. మా ప్రభుత్వం వున్నప్పుడు నేను అడగలేదు…ఇప్పుడు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెడతారా లేదో సమాధానం చెప్పాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని…కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదన్నారు.
బీజేపీకి రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు…రాష్ట్ర ప్రభుత్వం నూతన నియామకాల్లో ఎస్సిల,బీసీల వాటా ఎంత రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.బిఆర్ఎస్ పార్టీ 24 కార్పొరేషన్ చైర్మన్లు బీసీలకు కేసీఆర్ ఇచ్చారు… రేవంత్ రెడ్డి ముఠా మేస్త్రీలాగా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని మేము పడగొట్టాల్సిన అవసరం లేదు…నల్గొండ,ఖమ్మం నాయకులే రేవంత్ రెడ్డిని పడగొడతారన్నారు. పార్టీ డిసైడ్ చేస్తే ఎంపీగా పోటీ చేస్తాను…అందరి ముందే కంచె ఐలయ్యతో మాట్లాడాను అని చెప్పారు. కంచె ఐలయ్య రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడానికి అలా మాట్లాడారన్నారు.
Also Read:మహేష్ కోసం ఆ ముగ్గురు రెడీ