Kavitha:సీఎం రేవంత్‌వి సంకుచిత వ్యాఖ్యలు

31
- Advertisement -

సీఎం రేవంత్‌ రెడ్డివి సంకుచిత వ్యాఖ్యలు అని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. సమగ్ర కుటుంబ సర్వే వివరాలన్నీ కేసీఆర్ కుటుంబం దగ్గరే ఉన్నాయని శాసనసభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కులగణనకు చట్టబద్ధత కల్పించాలని …తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలన్నారు.

2011లో యూపీఏ ప్రభుత్వం రూ.4,500 కోట్ల ఖర్చుతో దేశవ్యాప్తంగా కులగణన చేసినా, నివేదిక మాత్రం ఇంకా బయటపెట్టలేదని గుర్తుచేశారు. ఆ వివరాలు రాహుల్ గాంధీ కుటుంబం దాచిపెట్టుకుందా చెప్పాలని డిమాండ్ చేశారు కవిత. ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి బీసీలు గుర్తుకు వస్తారని… కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తలా తోకా లేకుండా ప్రవేశపెట్టిన తీర్మానంతో కులగణన ఎలా చేస్తారని నిలదీశారు.

బీసీ సబ్ ప్లాన్‌కు కూడా చట్టబద్ధత కల్పించాలని… కులగణన తీర్మానం కంటితుడుపు చర్య అన్నారు. కుల గణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? ఎలా చేస్తారో చెప్పకుండా ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందన్నారు.

Also Read:Ram Charan:రామ్‌చరణ్ కు మరో ‘రంగస్థలం’ అవుతుందా!

- Advertisement -