కార్మికుల శ్రేయస్సే టీఆర్ఎస్ ప్రథమ కర్తవ్యమని తేల్చిచెప్పారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ( టీబీజీకేఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కెంగర్ల మల్లయ్యకు నియామక పత్రం అందజేశారు కవిత.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె… కరోనా సంక్షోభంలోనూ కార్మికులకు 29 శాతం లాభాల వాటా చెల్లించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.కార్మికుల పక్షాన బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి సంస్థను కాపాడుకుంటామని తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో టీబీజీకేఎస్ కీలక పాత్ర పోషించిందని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం సైతం కార్మికులకు అండగా నిలుస్తున్నది తెలిపారు. కార్మికుల శ్రేయస్సే టీఆర్ఎస్ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నదని స్పష్టం చేశారు.