Kavitha:జూన్ 3 వరకు రిమాండ్ పొడగింపు

19
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యూడిషియల్ రిమాండ్‌ను జూన్ 3వరకు పొడగించింది రౌస్ అవెన్యూ కోర్టు. నేటితో కవిత జ్యూడిషియల్ రిమాండ్ గడువు ముగియనుండగా ఇవాళ కోర్టులో హాజరు పర్చారు అధికారులు. విచారణ చేపట్టిన న్యాయమేర్తి సీబీఐ కేసులో జూన్ 3వ తేదీ వ‌ర‌కు రిమాండ్‌ను పొడిగిస్తూ జ‌డ్జి కావేరి బ‌వేజా ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ రెండు సంస్థలు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 15న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయగా.. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం కవిత ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.

Also Read:Hema:రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు

- Advertisement -