Kavitha:బీసీ కులగణన ఎందుకు చేయలేదు?

29
- Advertisement -

దేశాన్ని 60 ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఎందుకు బీసీ కులగణన చేపట్టలేదని ప్రశ్నించారు. ఇప్పుడు బీసీ కులగణన నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారని, బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారని చెప్పారు.

మంగళవారం రోజున నిజామాబాద్ లో జరిగిన నాయిబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ…గత ఐదారు రోజుల నుంచి బీసీ కుల గణనపై రాహుల్ గాంధీ కొత్తగా మాట్లాడుతున్నారని, కానీ సీఎం కేసీఆర్ 2014లో సీఎం కాగానే బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని స్పష్టం చేశారు. బీసీల కమిషన్ కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసిన తొలి పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. తాము డిమాండ్ చేయడంతో 2015-16లో బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించిందని అన్నారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాట్లాడడం లేదని విమర్శించారు. 60 ఏళ్లు దేశాన్ని ఏలినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 60 ఏళ్లలో ఏమి చేయకుండా ఇప్పుడడేమో చేస్తామని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతీ ఒక్కరు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఒక్క రోజులోనే సమగ్ర కుటుంబ సర్వే పేరిట ప్రజల వివరాలను సేకరించామని, అందువల్లనే అన్ని వర్గాలకు సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించగలేగుతోందన్నారు. కాబట్టి దేశంలో ఉన్న బీసీలందరికీ న్యాయం జరగాలని, అందు కోసం బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు కోటా ఉండాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు చేస్తామని అంటున్నారని, ఎన్నికలు రాగాలనే వాళ్లు ఆగమాగం చేస్తారని విమర్శించారు.

Also Read:MLC Kavitha:BRS అంటే బీసీల సర్కార్

సమాజంలో నాయిబ్రాహ్మణుల పాత్ర చాలా కీలకమైనదని తెలిపారు. నాయిబ్రాహ్మణుల కుల వృత్తిని కాపాడడానికి సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. చిన్న సెలున్లుకు 250 యూనిట్ల విద్యుత్తు వరకు సబ్సిడీ అందిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 37 వేల సెలున్లకు సబ్సిడీ వర్తిస్తోందన్నారు. 60 ఏళ్ల ఇతర పార్టీల పాలనలో నాయిబ్రహ్మణులకు ఏ ప్రభుత్వం అండగా నిలవలేదని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో బీసీలను చిన్నచూపు చూశాయని విమర్శించారు. బీసీలకు కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. బీసీల్లోనూ అత్యంత వెనుకబడిన వర్గాలను గతంలో ఏ పార్టీ అయినా పట్టించుకుందా అన్నది ఆలోచించాలని కోరారు.

- Advertisement -