అమిత్‌ షాకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు..

19
kavitha
- Advertisement -

హైదరాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న అమిత్ షాతో బీజేపీ నేత‌లు తాను అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని ఎమ్మెల్సీ క‌విత డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కవిత… స్వతంత్ర ఉద్యమంలో మీ పాత్ర ఏంటి..? హైదరాబాద్ సమైక్యత ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏంటి.? తెలంగాణ ఉద్యమం లో మీ పాత్ర ఏంటి..? చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రాలకు వచ్చి హామీలివ్వడం, ప్రజలు వారిని తిరస్కరించగానే, వంచించడం బీజేపీకి అలవాటుగా మారింద‌న్నారు. దేశంలో ప్రజలకు తమ హక్కులు కలిపించడానికి బీజేపి చేసిందేమీ లేద‌న్నారు. సామరస్యం, ఏకత్వం, ప్రజా బలం.. ఇవే సీఎం కేసీఆర్‌కు, తెలంగాణకు పునాది అని క‌విత స్ప‌ష్టం చేశారు.

- Advertisement -