2006 నుండి ఇప్పటి వరకు జాగృతి స్థాపించినప్పుడు అనేక ఉద్యమాలు చేశామన్నారు ఎమ్మెల్సీ కవిత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బతుకమ్మ పండుగ ను రాష్ట్ర పండుగ గా గుర్తించాలని జాగృతి ఆధ్వర్యంలో పోరాడినం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లొనే సాధించుకున్నాం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నే జాగృతి ఆద్వర్యంలో 20 వేల మంది కి ఉపాధి కల్పించాం అన్నారు.
తెలంగాణ జాగృతి నుండి భారత జాగృతి గా మార్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అని తెలిపిన కవిత..ఎప్పుడైతే బిసిలకు న్యాయం జరుగుతుందో అప్పుడే మహిళ రిజర్వేషన్లు అమలు అవుతాయన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం బిసి లకు అనేక వాగ్దానాలు ఇచ్చారు… అవి ఏంటి అంటే ప్రతి సంవత్సరం బిసి లకు 20 వేల కోట్లు బడ్జెట్ పెడతాం అని చెప్పిన్రు. రేపు ప్రారంభం అయే అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశ పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
కులగణన 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు ఇస్తాం అని చెప్పిన్రు. దీని ద్వారా 23 వేల 973 మందికి లోకల్ బాడి ఎన్నికల్లో గెలుస్తారని అంచనా వేశారు.. కులగణన చేసి 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాత నే లోకల్ బాడీ ఎన్నికలకు ముందుకు వెళ్లాలని మేము డిమాండు చేస్తున్నాం అన్నారు. యునైటెడ్ ఫూలే ఫ్రాంట్ & భారత జాగృతి ఆధ్వర్యంలో మూడు డిమాండ్లు చేస్తున్నాం అన్నారు.
1.అసెంబ్లీ లో పూలె విగ్రహం పెట్టాలి…
2.వెంటనే కులగణన చేసి 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి..
3. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో 20 వేల కోట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టాలి…
12 వ తేదీన ఇందిరా పార్కు లో మహా ధర్నా నిర్వహిస్తాం. ఈ ధర్నా లో 5 రాష్ట్రాల కు సంబంధించి వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు పాల్గొంటారు…తదుపరి కార్యాచరణ ధర్నా లో తెలియజేస్తాం అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు చదువుకోవాలి , కొంత అవగాహన తో మనం చదివింది పది మందికి తెలియజేస్తూ ముందుకు వెళ్లాలన్నారు.
Also Read:ఆ జిల్లాల్లో వైసీపీ.. పనైపోయిందా?