సూర్యాపేట జిల్లా పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బోనం ఎత్తుకుని లింగమంతుల స్వామి జాతరకు వచ్చారు కవిత. చౌడమ్మ తల్లికి బోనం సమ్పర్పించారు ఎమ్మెల్సీ కవిత. కవిత తో పాటు స్వామివారిని దర్శించుకున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ mp లింగయ్య యాదవ్ ఇతర నేతలు ఉన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. తెలంగాణ ప్రజలకు లింగమంతుల జాతర శుభాకాంక్షలు చెప్పారు. స్వామివారికి బోనం చెల్లిండం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. సమ్మక్క సారక్క జాతర తరువాత రెండో అతి పెద్ద జాతర లింగమంతుల జాతర అన్నారు.
Also Read:సీఈసీ నియామకంపై రాహుల్ లేఖ
తెలంగాణ రాష్ట్ర సంప్రదాయం, సంస్కృతులకు లింగమంతుల జాతర నిదర్శనం అన్నారు. కేసీఆర్ హయాంలో జాతరకు రూ.14 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది…ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాం అన్నారు. ఈ ప్రభుత్వం కూడా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాం అన్నారు.

