గ్రూప్ 1 పరీక్ష..సీఎంకు కవిత బహిరంగ లేఖ

15
- Advertisement -

గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. గ్రూప్ వ పరీక్షపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగలేఖ రాశారు కవిత. గ్రూప్ 1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి నెట్టి వేయబడ్డాయి అన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకం లేమి తేటతెల్లమైంది.. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీ లోపించింది అన్నారు. యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడడం అక్షయపనీయం అన్నారు.

గ్రూప్‌ -1 పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ కు వేర్వేరు హాల్ టికెట్ నెంబర్ల కేటాయింపుతో గందరగోళం నెలకొందని… 21,075 మంది మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యారని టీజీపీఎస్సీ ప్రకటించింది అన్నారు. ఫలితాలు ప్రకటించే సరికి ఆ అభ్యర్థుల సంఖ్య 21,085 మందికి చేరిందన్నారు. ఈ పది మంది అభ్యర్థుల సంఖ్య ఎలా పెరిగింది ? చెప్పాలన్నారు.

బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేసినా కూడా అభ్యర్థుల హాజరు విషయంలో ఎందుకు వ్యత్యాసాలు ఏర్పడ్డాయి ?, సదరు అభ్యర్థులు నిజంగానే మెయిన్స్‌ పరీక్షలకు అప్పియర్‌ అయ్యారా లేదంటే తర్వాత వారిని తెచ్చి చేర్చారా అనే సందేహం మిగతా అభ్యర్థుల్లో నెలకొందని చెప్పారు. జవాబు పత్రాల మూల్యాంకనంపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి… దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల ప్రొఫెసర్లతో వ్యాల్యుయేషన్‌ చేయిస్తామని తొలుత టీజీపీఎస్సీ ప్రకటించింది కానీ రిటైర్డ్‌ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించడంపైనా అభ్యర్థుల్లో అనుమనాలున్నాయి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించిన టీజీపీఎస్సీ తర్వాత ఒక సెంటర్‌ ను పెంచింది అని తెలిపారు కవిత.

Also Read:మోడీ చిత్తశుద్దిని నిరూపించుకోండి: కేటీఆర్

కేవలం రెండు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్‌ పరీక్షలకు హాజరైన రెండు కోచింగ్‌ సెంటర్లకు చెందిన 71 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించడం వెనుక ఏదో జరిగి ఉందని అభ్యర్థులు అనుమానాలు ఉన్నాయని… ఆ రెండు పరీక్ష కేంద్రాల్లో 71 మంది ఉద్యోగాలకు ఎంపికైనది నిజమేనని టీజీపీఎస్సీ కూడా అంగీకరించింది అన్నారు. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళన ధర్మబద్దమని హైకోర్టు కూడా గుర్తించి నియామకాల ప్రక్రియకు బ్రేకులు వేసింది… ‘నీళ్లు – నిధులు – నియామకాలు” తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యమనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి అన్నారు.

- Advertisement -