- Advertisement -
వాంకిడి ఘటన చాలా బాధాకరం అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎక్స్‌లో ట్వీట్ చేసిన కవిత..చిన్నారి ఇంకా వెంటిలేటర్ మీదనే ఉందని…ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయింది నెలకు ముగ్గురు చొప్పున యావరేజగా చనిపోయారు…నిన్న పేపర్ లో చూసాం మగనూరులో అన్నం లో పురుగులు వచ్చాయి అని సీఎం చెప్పడం జరిగిందన్నారు.
సీఎం ఈ విషయంపై దృష్టి పెట్టాలి…బిడ్డల ప్రాణాలను ప్రాధాన్యతగా గుర్తించండన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఏ పాఠశాలలో చూసిన ఏదో ఒక్క సమస్య ఉంది…పాఠశాలలో పైన ప్రభుత్వం ఫోకస్ చేయాలన్నారు. చనిపోయిన 42మంది కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు చొప్పున ఎక్సగ్రేషియా ఇవ్వాల్ని కోరుతున్నాం అన్నారు.
Also Read:సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదు: షిండే
- Advertisement -