ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చెల్లించాలి

6
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను విస్మరించడాన్ని నిరసిస్తూ ధర్నా చౌక్ వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన ధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కవిత.. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అన్నారు.

ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచి వారు తలెత్తుకొని జీవించేలా చేశాం.. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అయిన పీఆర్సీని వర్తింపచేశాం అన్నారు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణం.. వెంటనే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి అన్నారు.

 

Also Read:చుక్కా రమేష్ కుటుంబానికి కేటీఆర్ సాయం

- Advertisement -