ఆపరేషన్ కగార్‌ నిలిపివేయాలి: కవిత

18
- Advertisement -

ఆపరేషన్ కగార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి అని డిమాండ్ చేశారు. తక్షణమే మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి… మావోయిస్ట ప్రభావిత రాష్ట్రాల్లోని అన్ని పార్టీలతో మాట్లాడాలి అన్నారు.

కాల్పులతో మావోయిస్టులను అంతం చేస్తామన్న కేంద్రం విధానం సరికాదు… ప్రజాస్వామ్యబద్ధంగా శాంతి చర్చలు నిర్వహించాలి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ హయాంలో 3500 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారు అన్నారు.

కేసీఆర్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్ల చత్తీస్ ఘడ్ నుంచి వచ్చి కూడా తెలంగాణలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారు… కేసీఆర్ విధానాలను ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగించాలి అన్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారు … ఎవరు చనిపోయినా కూడా మన దేశ పౌరులే కాబట్టి కేంద్రం చొరువ తీసుకోవాలి అన్నారు.

Also Read:ఈ వారం ఓటీటీ సినిమాలివే!

- Advertisement -