మూసీ బాధితుల సమస్యపై గళమెత్తారు ఎమ్మెల్సీ కవిత. మూసీ నది విషయంలో డీపీఆర్ ఆధారంగా అంచనా వ్యయాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ రూ. 4100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వ ఆశ్రయించినట్లు మాకు నిర్ధిష్టమైన సమాచారం ఉందన్నారు కవిత.181 కుటుంబాలు తామంతట తామే కూల్చేసుకొని వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోంది… ఇది వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంది. మూసీ నిర్వాసితుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించాలి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత సూచించారు.
మూసీ అభివృద్ధి పేరిట ఆ పరివాహక ప్రాంతంలో కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐలు ఉంటే ప్రభుత్వం చెల్లిస్తుందా..? అని ప్రశ్నించారు. మూసీ అభివృద్ధి కోసం మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(MRDCL) ద్వారా డీపీఆర్ చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు శాసనమండలిలో ప్రస్తావించగా.. ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించిన విషయం వాస్తవమా కాదా..? డీపీఆర్ తయారు కాలేదని ప్రభుత్వం ఈ రోజు సభకు చెప్పింది.
ఏ తేదీన ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సాయం కోరుతూ ప్రతిపాదనలు పంపించింది. మూసీ కోసం రూ. 14,100 కోట్ల వ్యయం అవుతుందని, నిధులతో పాటు అనుమతులు ఇప్పించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఏ ప్రాతిపదికన అడిగారు. ఒక వేళ కేంద్రాన్ని సాయం కోరడం, ప్రపంచ బ్యాంకు సాయం కోరడం వాస్తవమైతే సభను, ప్రజలను ఎందుకు తప్పదోవపట్టిస్తున్నారు..? సభను తప్పదోవ పట్టిస్తే అవసరమైతే… ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెడుతాం అని కవిత హెచ్చరించారు.
Also Read:జేపీసీకి వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు