రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు: కవిత

3
- Advertisement -

కేటీఆర్‌పై కేసు నమోదుపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత. రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు పెడుతున్నారు అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు…సీఎం రేవంత్‌కు అసెంబ్లీలో చర్చ పెట్టే ధైర్యం లేదు అన్నారు. చిల్లర‌ వ్యూహాలు మమ్మల్ని భయపెట్టవు అని స్పష్టం చేశారు కవిత.

మరోవైపు ఫార్ములా-ఈ కేసు విషయంలో ఏసీబీ తనపై కేసు నమోదు చేయడంపై హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్‌, ఏ2గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, ఇతరులపై కేసు నమోదు చేశారు. ఐసీపీ (బీఎన్‌ఎస్‌) 13(1)(ఏ), 13(2), సీపీయాక్ట్‌ 409, 120 (బీ) సెక్షన్స్‌ కింద అభియోగాలు మోపారు.

Also Read:అవినీతి లేదు అంటూనే అక్రమ కేసా: కౌశిక్ రెడ్డి

- Advertisement -