MLC Kavitha: బీసీ రిజర్వేషన్ల అమలులో చిత్తశుద్ది ఏది?

0
- Advertisement -

బీసీ రిజర్వేషన్ల అమలులో చిత్తశుద్ది ఏదని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. ఇందిరా పార్క్ వ‌ద్ద నిర్వ‌హించిన బీసీ మ‌హాస‌భ‌లో క‌విత పాల్గొని ప్ర‌సంగించారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ అన్నారు అని గుర్తు చేశారు.

1980లో మండల్ కమిషన్ నివేదిక ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు..? చెప్పాలన్నారు. మళ్లీ కాంగ్రెసేతర ప్రధాని వీపీ సింగ్ వచ్చినప్పుడే కమిషన్ నివేదికను అమలు చేసింది. బీసీల కోసం పని చేస్తున్న వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ కూలగొట్టింది అని క‌విత గుర్తు చేశారు.కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయని మండిపడ్డారు.

తాను చెప్పినవి తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాన‌ని క‌విత స‌వాల్ విసిరారు. సావిత్రీబాయి పూలే ఆడబిడ్డ కాదు… పులిబిడ్డ. మహిళా విద్యాకు ఎంతగానో కృషి చేశారు అన్నారు.

Also Read:KTR:ప్రమాణ పత్రం ఇస్తేనే రైతు భరోసానా?

- Advertisement -