Kavitha: బీసీలకు న్యాయం జరగలేదు

1
- Advertisement -

డెడికేటెడ్ కమీషన్ కు నివేదిక ఇచ్చామని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. బీసీ వర్గాలకు జరగాల్సిన న్యాయం జరగలేదు…రాజ్యాంగం ప్రకారం బీసీలకు హక్కులు కల్పించలేదు అన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం జరిగిందన్నారు. బీసీలకు రాజకీయంగా,ఆర్ధికంగా ప్రాంతీయ పార్టీలతోనే జరిగిందని…బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో చెప్పిందన్నారు.

బీజేపీ డీఎన్ఏలో బీసీ,ఎస్సి,ఎస్టీలకు వ్యతిరేకంగా ఉందని…బీసీలకు స్థానిక సంస్ధల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. బీసీలకు హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలి…11 నెలల పాటు బీసీ డెడికేటెడ్ కమీషన్ ఏర్పాటు చేయలేదు అన్నారు.

డెడికేటెడ్ కమీషన్ కు కుర్చీ లేదు,ఏర్పాట్లు ప్రభుత్వం చేయలేదు…నెల రోజుల్లో డెడికేటెడ్ కమీషన్ రిపోర్ట్ ఎట్లా ఇస్తుందన్నారు. కులగణన కోర్టుల్లో నిలబడుతుందా లేదా అనేది ప్రభుత్వం చెప్పాలి…బీసీల అనుమానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నివృత్తి చేయాలి అన్నారు. హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల్లో అనేక చోట్ల ఇంటికి స్టిక్కర్లు అంటించలేదు…డెడికేటెడ్ కమీషన్ ఇండిపెండెంట్ గా పని చేయాలి అన్నారు. కమిషన్ రిపోర్ట్ రాజకీయ రిజర్వేషన్లకు పరిమితం కాకూడదు ఇతర బీసీ అంశాలపై నివేదిక ఇవ్వాలి…మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినట్లు బీసీల కోసం పోరాటం చేస్తాము అన్నారు.

Also Read:మీ వాహనాలపై ఆ స్టిక్కర్లు ఉన్నాయా?అయితే!

- Advertisement -