ఓటర్లకు చేరువవ్వటంలో ఒక్కో నేతకు ఒక్కో స్టైల్ ఉంటుంది. కానీ, ఓటర్లనే కాదు పొలిటికల్ సర్కిల్స్ ను సైతం ఇంప్రెస్ చేసేలా దూసుకుపోవటం అందరికీ సాధ్యం కాదు. కానీ, ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ప్రచార సరళి చూస్తే తెలంగాణ ఎలన్నికల ప్రచారంలో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్సీ కవిత.
అవును… ప్రచారం అనగానే, భారీ సభలు… ర్యాలీలు, ఇంటింటికి వెళ్తూ బొట్టు పెడుతూ ఓట్లు అడటటం, చౌరస్తాలలో మీటింగ్ లు ఇవి కామన్. కానీ, మారిన రాజకీయాల్లో ఇవన్నీ దాదాపు పెయిడ్. స్వచ్ఛందంగా జనం భారీ బహిరంగ సభలకు రావటం ఎప్పుడో మానేశారు. రాజకీయ పార్టీల సభలకు అస్సలు రావట్లేదు. ఇది ఓపెన్ సీక్రెటే.. కానీ ఓటర్లను ఆలోచించేలా, ఆకట్టుకునేలా చేసే ట్రిక్స్ కొన్ని ఉంటాయి.
నిజానికి తెలంగాణ ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో ఉన్నది యువతే. ఫస్ట్ టైం ఓటర్స్, ఐటీ ఉద్యోగాలు చేసే వాళ్లు, సొంతగా పైకి రావాలి అనే తపనతో తండ్లాడుతున్న వాళ్లు ఎందరో. వారందరిలో కొందరి సర్కార్ ఇలా చేయాల్సింది, అలా అయితే బాగుండు… ఇలా ఎన్నో కొత్త ఆలోచనలుంటాయి. సాధ్యాసాధ్యాలు పక్కనపెడితే యుక్త వయస్సు ఊహా ప్రపంచం. ఈసారి ఓటర్ లిస్ట్ గమనిస్తే… 3.14కోట్ల ఓటర్లలో 18-19 ఏళ్ల మధ్యలోని వారు దాదాపు 7లక్షల మంది ఉన్నారు. 19-35 ఏళ్ల మధ్యలో 75లక్షల ఓటర్లున్నారు. నెక్ టు నెక్ ఉన్న తెలంగాణ ఎన్నికల రణరంగంలో వీరే కీలకం అయ్యారు.
అలాంటి ఓటర్లలో ఆలోచన కొత్తగా బీజాలు నాటడం అంత హిజీ కాదు. పైగా సర్కారుకు అనుకూలంగా…. ! ఆ పనిలో ముందు నుండి ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులతో ఇంటర్నల్ గా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇది బయటకు పెద్దగా ప్రచారంలోకి రాలేదు. అందులోనూ మహిళల శాతం ఎక్కువగా ఉన్న మీటింగ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలతో స్పెషల్ గా మీటింగ్స్ పెట్టుకోవటం, నిజామాబాద్ లో ఫస్ట్ టైం ఓటర్లతో మాట్లాడుతూ… నెగెటివ్ ప్రశ్నలకు కూడా వారికి ఆన్సర్స్ ఇవ్వటం… ఇలా కొత్త ట్రెండ్ కు నాంది పలికారు.
ఆ తర్వాత కేటీఆర్, రాహుల్ గాంధీ కూడా చేసినప్పటికీ… తెలంగాణ రాజకీయాల్లో మాత్రం షురూ చేసిన లీడర్ అయితే ఎమ్మెల్సీ కవితే!
Also Read:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు..