జూలై 3 వరకు కవిత జ్యూడిషియల్ రిమాండ్

17
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యూడిషియల్ రిమాండ్‌ను మరోసారి పొడగించింది రౌస్ అవెన్యూ కోర్టు. జూలై 3 వరకు రిమాండ్‌ను పొడగిస్తున్నట్లు వెల్లడించింది న్యాయస్థానం. జ్యుడీషియల్‌ కస్టడీ నేటితో ముగియనుండగా కోర్టు ఎదుట కవితను హాజరుపర్చారు అధికారులు.

లిక్కర్ కేసులో మార్చి 15న ఈడి అధికారులు కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఏప్రిల్ 11న తీహార్ జైలు నుంచి ఆమెను సీబిఐ అరెస్ట్ చేసింది. ఇక సీబీఐ కేసులో ఇవాళ మధ్యాహ్నం విచారణ జరగనుంది.

Also Read:కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్సీ నవీన్

- Advertisement -