కరోనా పేషెంట్లకు అండగా ఎమ్మెల్సీ కవిత..

123
kavitha
- Advertisement -

కరోనా కష్ట కాలంలో, పేషెంట్లను, బాధిత కుటుంబాలను నిండుమనసుతో ఆదుకుంటున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న అనేక మంది కరోనా బాధితులకు, వలస కార్మికులకు, ఉద్యోగులకు సాయం అందించిన ఎమ్మెల్సీ కవిత, ప్రస్తుతమూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. కోవిడ్ పేషెంట్లకు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలపై, ఈరోజు హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత సమీక్ష నిర్వహించారు. హెల్ప్ లైన్ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు, ఎమ్మెల్సీ కవిత పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పలు ఆసుపత్రుల వైద్యులు, కరోనా పేషెంట్లతో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత.

కరోనా సెకండ్ వేవ్ దేశమంతా విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రంగా ఉంది. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సైతం కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో కరోనా విషయంలో ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు హైదరాబాద్ కార్యాలయంలో 040-23599999 / 89856 99999, నిజామాబాద్ కార్యాలయంలో 08462- 250666 ఫోన్ నెంబర్లతో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు ఎమ్మెల్సీ కవిత. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటే ఈ కాల్ సెంటర్లకు, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి ప్రతిరోజు కరోనా బాధితులు సాయం కోసం సంప్రదిస్తున్నారు.

కాల్ సెంటర్లకు వచ్చే ప్రతి విజ్ఞప్తిని నేరుగా పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ కవిత, ఆస్పత్రుల్లో బెడ్లు, రెమ్ డెసివిర్ ఇంజక్షన్ లు, ఆక్సిజన్, వెంటిలేటర్ వంటి అన్ని విషయాలపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేస్తూ, కరోనా పేషంట్లకు, వారి కుటుంబాలకు ఎమ్మెల్సీ కవిత భరోసానిస్తున్నారు. ఒకవేళ జిల్లా ఆస్పత్రుల్లో బెడ్ అందుబాటులో లేని సమయంలో, బాధితులను త్వరితగతిన హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్యం అందించేదుకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ద్వారా, హోం ఐసోలేషన్ లో ఉన్న వారికి సైతం, మందులు, ఆహారం వంటి వాటిని నేరుగా పేషెంట్ల ఇండ్లకు చేరేవేస్తున్నారు. దీంతోపాటు ట్విట్టర్ వేదికగా వస్తున్న వినతులపైనా ఎమ్మెల్సీ కవిత దృష్టి సారిస్తున్నారు. బాధితుల వివరాలను సంబంధిత అధికారులకు, ఆస్పత్రులకు షేర్ చేస్తూ, వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు.

నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో కోవిడ్ 19 పరిస్థితిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవలే సమీక్షించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, జగిత్యాల జిల్లా కలెక్టర్ రవితో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, కరోనా పరీక్షలు, చికిత్స, ఆసుపత్రులు వంటి అన్ని అంశాలపై చర్చించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులతో చర్చించి, నిజామాబాద్ జిల్లాకు వెయ్యి డోసుల రెమెడెసివిర్ ఇంజక్షన్లు, పదివేలకు పైగా కరోనా టెస్టింగ్ కిట్ లు అందుబాటులోకి తెచ్చారు. దీంతోపాటు కోరుట్ల, మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్టింగ్ కిట్ లు అందుబాటులో ఉంచేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కోవిడ్ హెల్ప్ లైన్, ట్విట్టర్ ద్వారా కరోనా బాధితులకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్సీ కవిత గారిపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -